ఓటిటిలో “సలార్” కి సెన్సేషనల్ రెస్పాన్స్

ఓటిటిలో “సలార్” కి సెన్సేషనల్ రెస్పాన్స్

Published on Jan 24, 2024 9:04 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కించిన మాసివ్ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం రిలీజ్ అయ్యాక భారీ వసూళ్ళని అందుకోగా రిలీజ్ అయ్యిన నెల లోపే ఓటిటిలో కూడా ఈ చిత్రం వచ్చేసింది. ఇక ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కాగా ఇందులో కూడా సత్తా చాటుతున్నట్టుగా తెలుస్తుంది.

ఈ చిత్రం లేటెస్ట్ గా 6 లక్షలకి పైగా స్ట్రీమింగ్ మినిట్స్ ని నెట్ ఫ్లిక్స్ లో క్రాస్ చేయగా జస్ట్ ఈ రెండు రోజుల్లోనే 16 లక్షలకి పైగా వ్యూస్ ని అందుకున్నట్టుగా తెలుస్తుంది. దీనితో ఓటిటి లో కూడా సలార్ సెన్సేషన్ ని సెట్ చేస్తుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి రవి బసృర్ సంగీతం అందిస్తుండగా హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే మేకర్స్ అతి త్వరలోనే సలార్ శౌర్యంగ పర్వాన్ని కూడా స్టార్ట్ చేస్తారని టాక్ ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు