సరిగ్గా ఏడాదిలో “సలార్” బాక్సాఫీస్ సునామి..!

Published on Sep 28, 2022 10:00 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో ఇండియన్ సినిమా దగ్గర ఒక బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ లా వస్తున్న భారీ చిత్రం “సలార్” కూడా ఒకటి. సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో చేస్తున్న సినిమా ఇది కావడంతో దీనిపై కేజీయఫ్ ని మించి భారీ స్థాయి అంచనాలు నెలకొన్నాయి. మరి నీల్ కూడా ఈ చిత్రాన్ని కేజీయఫ్ కి పదింతలు యాక్షన్ తో చేస్తున్నానని హామీ ఇచ్చాడు.

ఇక దీనితో అయితే ఈ సినిమా పై పాన్ ఇండియా లెవెల్లో అంచనాలు వేరే లెవెల్ కి వెళ్లాయి. ఇక ఈ చిత్రం తాలుకా రిలీజ్ డేట్ ని అయితే మేకర్స్ రీసెంట్ గానే అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. మరి దానికి అయితే ఈరోజు నుంచి సరిగ్గా ఏడాది ఉంది. ఈ చిత్రంని వచ్చే ఏడాది ఇదే రోజు అక్టోబర్ 28న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీనితో సరిగ్గా సలార్ మాస్ బాక్సాఫీస్ సునామీకి ఏడాది ఉందని చెప్పాలి. ఇప్పటికీ సినిమాకి రికార్డు స్థాయిలో ఆఫర్స్ ఉన్నాయి. ఇక రిలీజ్ అయ్యాక అయితే సినిమా సెన్సేషన్ చూడాలి.

సంబంధిత సమాచారం :