“బిగ్ బాస్” నుంచి “RRR” టీం కి సల్మాన్ కంగ్రాట్స్.!

“బిగ్ బాస్” నుంచి “RRR” టీం కి సల్మాన్ కంగ్రాట్స్.!

Published on Jan 14, 2023 3:08 PM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియా హిట్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” పేరు వరల్డ్ వైడ్ గా మారుమోగుతోంది. మరి ఇదిలా ఉండగా రీసెంట్ గానే సినిమాలో సెన్సేషనల్ చార్ట్ బస్టర్ హిట్ సాంగ్ నాటు నాటు కి గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు రాగా అనేకమంది సినీ ప్రముఖులు దేశ వ్యాప్తంగా అభినందించారు.

ఇక ఈ సినిమాపై చిత్ర యూనిట్ కి గాను బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన బిగ్ బాస్ షో నుంచి నేరుగా తన శుభాకాంక్షలు తెలియజేసారు. దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ మెయిన్ గా తమ కీరవాణి.. క్రీమ్ గారికి నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు గెలుచుకోవడం గర్వకారణం అని వారికి కంగ్రాట్స్ తెలుపుతున్నానని చెప్పారు. దీనితో సల్మాన్ విషెస్ కి గాను చిత్ర యూనిట్ థాంక్స్ చెప్తూ ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు