సక్సెస్ మీట్ జరుపుకుంటున్న ‘యూ టర్న్’ !

Published on Sep 18, 2018 12:09 pm IST

పవన్ కుమార్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘యూ టర్న్’ చిత్రం గుడ్ మౌత్ టాక్ కారణంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డీసెంట్ రెవిన్యూని రాబట్టుకోగలిగింది. ఈ సినిమాలో రచన అనే జర్నలిస్టు పాత్రలో నటించన సమంత, తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. దర్శకుడు పవన్ ఈ సినిమాలో చెప్పాలనుకున్న మెసేజ్ కూడా నేటి సమాజానికి ఎంతో ఉపయోగం కావడంతో.. సినిమా పై సహజంగానే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. దీనికి తోడు సినిమా కూడా, ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే తో.. ఉత్కంఠభరితంగా సాగడంతో.. ఓవరాల్ గా చిత్రం మంచి విజయం సాధించింది.

కాగా ఈ చిత్రంలో అది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ చిత్రం అంగరంగ వైభవంగా సక్సెస్ మీట్ జరుపుకుంటుంది. ఈ సక్సెస్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవితగారు హాజరయ్యారు. ఈ కార్యక్రమం లైవ్ మీ కోసం…

వీడియో కోసం క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :