ఫిబ్రవరి నుండి మొదలుకానున్న సమంత చిత్రం !

కన్నడలో సూపర్ హిట్ గా నిలిచినా ‘యు టర్న్’ చిత్రాన్ని ఎన్నాళ్ళ నుండో రీమేక్ చేయాలని తెలుగు స్టార్ హీరోయిన్ సమంత భావిస్తున్న సంగతి తెలిసిందే. మధ్యలో కొంత ఆలస్యమైనా ఎట్టకేలకు ప్రాజెక్ట్ ట్రాక్ పైకి వచ్చింది. తెలుగుతో పాటు తమిళంలో కూడా చిత్రాన్ని రీమేక్ చేయనున్నారు.

రెండు భాషల్లోనూ సమంత ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ రెండు వెర్షన్లను కూడా ఒరిజినల్ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన పవన్ కుమార్ డైరెక్ట్ చేయనుండటం విశేషం. ఈ సూపర్ నేచ్యురల్ థ్రిల్లర్ యొక్క రెగ్యులర్ షూట్ ఫిబ్రవరి నుండి మొదలుకానుంది.