‘కేరాఫ్ సూర్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఖరారు !
Published on Oct 31, 2017 11:14 am IST

సందీప్ కిషన్ తాజా ద్విభాషా చిత్రం ’కేర్ అఫ్ సూర్య’ కార్తి తో ‘నా పేరు శివ’ చిత్రానికి దర్శకత్వం వహించిన సుశిద్రన్ ఈ సినిమాకు దర్శకుడు. మధ్యతరగతి కుటుంబాల్లోని అనురాగాలు, ఆప్యాయతలు, కన్నీళ్లకు అద్దంపట్టే విధంగా ఈ సినిమా తెరకెక్కించారు దర్శకుడు, చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న ఈ సినిమాలో మెహరీన్ కథానాయిక ఇమాన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలకు మంచి స్పందన లభిస్తుంది.

ఈ చిత్రాన్ని నవంబర్ 10 న రెండు భాసల్లో ఒకేసారి విడుదల చెయ్యనున్నారు. నవంబర్ 2 న హైదరాబాద్ లో భారీగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ చెయ్యబోతున్నారు. సాయి ధరమ్ తేజ్, శర్వానంద్ వంటి యువహీరోలు ఈ వేడుకలో పాల్గొనున్నారు. సూర్య ఎవరు ? ఒక సంఘటన అతని జీవితాని ఎన్నిరకాలుగా మలుపు తిప్పింది ? అనే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోబోతుందని సమాచారం. ఈ సినిమాతో సందీప్ కిషన్ మంచి విజయం సాదించాలని కోరుకుందాం.

 
Like us on Facebook