బన్నీ “సరైనోడు” కి మరోసారి సాలిడ్ రెస్పాన్స్!

బన్నీ “సరైనోడు” కి మరోసారి సాలిడ్ రెస్పాన్స్!

Published on Feb 1, 2024 6:41 PM IST

అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంల5 తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ సరైనోడు. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. ఈ చిత్రం కి బుల్లితెర పై మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఇప్పుడు మరోసారి సెన్సేషన్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం మరోసారి ప్రముఖ టీవీ ఛానల్ అయిన జెమిని టీవీ లో ఇటీవల ప్రసారం అయ్యింది.

ఈ చిత్రం 5.47 టీఆర్పీ రేటింగ్ ను రాబట్టడం జరిగింది. ఇది చాలా మంచి రెస్పాన్స్ అని చెప్పాలి. బన్నీ చిత్రాలకి టీవీ లో ఈ తరహా రేటింగ్ రావడం కామన్ గా మారిపోయింది. ఈ చిత్రం లో రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ థెరిస్సా లు లేడీ లీడ్ రోల్ లో నటించగా, మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు