నైజాంలో “సర్దార్, ఓరి దేవుడా, ప్రిన్స్” ల లేటెస్ట్ వసూళ్ల డీటెయిల్స్!

నైజాంలో “సర్దార్, ఓరి దేవుడా, ప్రిన్స్” ల లేటెస్ట్ వసూళ్ల డీటెయిల్స్!

Published on Oct 25, 2022 12:02 AM IST

ఈ వారంలో ఒక్కసారే టాలీవుడ్ దగ్గర మరిన్ని మంచి చిత్రాలు అయితే ఆడియెన్స్ ముందుకు వచ్చాయి. మరి ఈ చిత్రాల్లో తెలుగు సహా డబ్ చిత్రాలు కూడా ఉండగా ఈ చిత్రాలు అయితే వసూళ్ల పరంగా మంచి ఓపెనింగ్స్ కూడా అందుకున్నాయి. మరి ఈ చిత్రాల్లో అయితే మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన “ఓరి దేవుడా”, తమిళ స్టార్ హీరో కార్తీ నటించిన “సర్దార్” అలాగే శివకార్తికేయన్ “ప్రిన్స్” చిత్రాలు నైజాం లో మంచి పెర్ఫామెన్స్ ని కొనసాగిస్తున్నాయి.

ఇక లేటెస్ట్ గా ఈ చిత్రాల మూడో రోజు వసూళ్లు చూసినట్టు అయితే సర్దార్ 67 లక్షల నెట్ వసూళ్లు అందుకోగా ఈ మూడు రోజుల్లో ఈ చిత్రం 1.9 కోట్ల నెట్ వసూళ్లు అందుకుంది. ఇక ఓరి దేవుడా అయితే మూడో రోజు 45 లక్షల నెట్ వసూళ్లు అందుకోగా ఈ మూడు రోజుల్లో 1.55 కోట్ల నెట్ వసూళ్లు అందుకుంది.

ఇక ఫైనల్ గా ప్రిన్స్ అయితే డే 3 30 లక్షల నెట్ అందుకోగా ఈ మూడు రోజుల్లో 1.24 కోట్ల నెట్ వసూళ్లు ఈ సినిమా అందుకుంది. ఓవరాల్ గా అయితే ఈ మూడు చిత్రాలు కూడా డీసెంట్ వసూళ్లు అయితే అందుకుంటున్నాయి. మరి ఫైనల్ రన్ కి ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు