ఈరోజు నుండి మొదలుకానున్న ‘సవ్యసాచి’ రెగ్యులర్ షూట్ !
Published on Nov 8, 2017 8:31 am IST

అక్కినేని నాగ చైతన్య సైన్ చేసిన తాజా చిత్రం ‘సవ్యసాచి’. పేరులోనే బోలెడంత వైవిధ్యాన్ని నింపుకున్న ఈ సినిమా పట్ల అందరిలోనూ ప్రత్యేక ఆసక్తి నెలకొని ఉంది. అంతేగాక చైతుతో గతంలో ‘ప్రేమమ్’ వంటి సూపర్ హిట్ సినిమాని తీసిన చందూ మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటం వలన కూడా ఫలితంపై నమ్మకాల్ని పెంచుతోంది.

ఇకపోతే ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ ఈరోజు ఉదయం 9 గంటలకు హైదరాబాద్లో ప్రారంభం కానుంది. యాక్షన్ ప్రధానంగా రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి నిధి అగర్వాల్ ను హీరోయిన్ గా నటిస్తోంది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook