నటనకు స్కోప్ ఉన్న రోల్స్ చేయాలని ఉంది – సెహరి నటి అక్షిత శెట్టి

Published on Feb 28, 2022 2:04 pm IST

ఇటీవల థియేటర్స్ లో సందడి చేసిన సెహరి సినిమాలో మహాలక్ష్మి పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తెలుగమ్మాయి అక్షిత శెట్టి. అక్షిత శెట్టికి మహాలక్ష్మి పాత్రతో మంచి ఆదరణ లభించింది. ఈ రోల్ కు ముఖ్యంగా యువత నుండి మంచి అప్లాజ్ లభించడం విశేషం. ఫ్రెండ్స్ తనలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ చూసి మూవీస్ లో నటిస్తే బాగుంటుందని సజెస్ట్ చెయ్యడంతో అక్షిత సెహరి సినిమాలో నటించడం జరిగింది.

లెజండరీ నటుడు బ్రహ్మానందం ఇన్స్పిరేషన్ తో మరిన్ని మంచి రోల్స్ చేసి ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయాలన్నది అక్షిత లక్ష్యం. నటనకు స్కోప్ ఉన్న రోల్స్ చేసి మరింత మంది ప్రేక్షకులకు చేరువవ్వాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలిపారు. భవిష్యత్తులో అక్షిత శెట్టి మరిన్ని మంచి రోల్స్ తో పలకరించాలని ఆశిద్దాం.

సంబంధిత సమాచారం :