బాలీవుడ్ లో అడుగు పెట్టనున్న శేఖర్ సూరి

Published on Apr 15, 2014 1:22 am IST


ఈ ఏడాది క్రిష్ తర్వాత మరో తెలుగు దర్శకుడు బాలీవుడ్ లో అడుగు పెట్టనున్నాడు. గతం లో ‘ఏ ఫిలిం బై అరవింద్’, ‘త్రీ’, ‘అరవింద్ 2’ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన శేఖర్ సూరి హిందీ లో ‘గన్స్ ఆఫ్ బెనారస్’ అనే చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. కరణ్ నాథ్ మరియు నతలియా కౌర్ లో ఈ చిత్రం లో ముఖ్య పాత్రలు పోషించనున్నారు.
‘గన్స్ ఆఫ్ బెనారస్’ ధనుష్ ‘పొల్లదవన్’ చిత్రానికి రీమేక్ అని సమాచారం. అదే చిత్రాన్ని తెలుగు లో ‘కుర్రాడు’ పేరుతో నిర్మింపబడింది. ఆ చిత్రం లో వరుణ్ సందేశ్ నేహ శర్మ ముఖ్య పాత్రలు పోషించారు. ‘గన్స్ ఆఫ్ బెనారస్’ చిత్రం దాదాపు పూర్తి కాగా ఈ చిత్రం చాలా బాగాన్ని వారణాసి ముంబాయి గోవా లలో చిత్రీకరించారు. మరో దక్షిణాది నటుడు గణేష్ వెంకటరామన్ ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ లో అడుగు పెట్టనున్నాడు. అభిమన్యు సింగ్ వినోద్ ఖాన్న ఇతర ముఖ్య పాత్రలు పోషించనున్నారు.
శేఖర్ సూరి చివరి చిత్రం ‘అరవింద్ 2’ గత ఏడాది మార్చి లో విడుదల అయింది. ఆ చిత్రం లో కమల్ కామరాజు అడోనికా రోదిక్స్ శ్రీ ముఖ్య పాత్రలు పోషించారు . అయితే ఆ చిత్రం విజయం సాధించలేకపోయింది. శేఖర్ సూరి బాలీవుడ్ ఎంట్రీ తన భవిష్యతు ని మార్చుతుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

More