షూటింగ్ మొదలుపెడుతున్న సెన్సేషనల్ డైరెక్టర్ !
Published on Oct 23, 2017 8:37 am IST


గతేడాది తెలుగు చిత్ర పరిశ్రమ అందుకున్న భారీ విజయాల్లో ‘పెళ్లి చూపులు’ చిత్రం కూడా ఒకటి. నూతన దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలైన అన్ని ఏరియాల్లోనూ భారీ కలెక్షన్లను సాధించి డిస్ట్రిబ్యూటర్లకు కళ్ళు చెదిరే లాభాల్ని తెచ్చిపెట్టింది. ఇంతటి విజయానికి ప్రధాన కారణం తరుణ్ భాస్కర్ కథను చెప్పిన విధానమే అనాలి. ఈ విజయం తర్వాత ఆయన ఎలాంటి సినిమా చేస్తారో చూడాలని ప్రేక్షకుల్లో కుతూహలం నెలకొంది.

ప్రేక్షకుల్లో ఏర్పడ్డ ఆ అంచనాలను అందుకోవడానికి తరుణ్ భాస్కర్ కాస్త ఎక్కువ సమయమే తీసుకుని యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ ను రెడీ చేసుకున్నారు. ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ ఈరోజే హైదరాబాద్లో మొదలుకానుంది. అందరూ కొత్తవాళ్లే నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సురేష్ బాబు నిర్మిస్తున్నారు. గతంలో సురేష్ బాబు ‘పెళ్లి చూపులు’ చిత్రానికి కూడా మంచి సపోర్ట్ అందించి చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

 
Like us on Facebook