శర్వానంద్ కు జోడిగా సెన్సేషనల్ హీరోయిన్ !
Published on Oct 17, 2017 11:01 am IST

యంగ్ హీరో శర్వానంద్ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వరుస విజయాల్ని అందుకుంటున్నాయి. తాజాగా మారుతి దర్శకత్వం లో వచ్చిన ‘మహానుభావుడు’ అయితే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తరువాత శర్వానంద్ ఎలాంటి సినిమా చేస్తాడోనని అందరూ అనుకుంటుండగా సుధీర్ వర్మ చెప్పిన పాయింట్ కి శర్వా ఓకే చెప్పినట్లు సమాచారం.

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయి, సెన్సేషన్ గా మారిన షాలిని పాండే ఈ సినిమాలో శర్వా తో జత కట్టనుందట. అంతేగాక నివేత థామస్ కూడా సర్వేకు జోడీగా నటిస్తుందని గతంలో వార్తలొచ్చాయి. ఇవి ఏ మేరకు వాస్తవమో తెలియాలంటే నిర్మాణ సంస్థ నుండి అధికారిక ప్రకటన వెలువడే వరకు ఆగాల్సిందే. తొలిసారిగా శర్వానంద్ ఈ సినిమాతో ద్విపాత్రాభినయం చేస్తుండడం విశేషం.

 
Like us on Facebook