యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలతో ఆకట్టుకుంటున్న ‘శాకినీ ఢాకిని ట్రైలర్

Published on Sep 12, 2022 10:34 pm IST

నివేతా థామస్, రెజీనా కాసాండ్రా ప్రధాన పాత్రల్లో సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ శాకినీ ఢాకిని. యాక్షన్ తో పాటు థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన శాకినీ ఢాకిని మూవీకి రిచర్డ్ ప్రసాద్ కెమెరామెన్‌గా, మిక్కీ మెల్క్రెరీ సంగీత దర్శకుడుగా, విప్లవ్ నైషధం ఎడిటర్ గా పని చేస్తున్నారు. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై బాగా హైప్ ఏర్పరిచింది. కాగా నేడు జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా కొద్దిసేపటి క్రితం ఈ మూవీ యొక్క థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేసింది యూనిట్.

ట్రైలర్ ని పరిశీలించినట్లయితే కామెడీ, యాక్షన్, ఎమోషనల్ సీన్స్ లో అటు రెజీనా, ఇటు నివేతా ఇద్దరూ కూడా ఆకట్టుకున్నారు. అమ్మాయిలను కిడ్నాప్ చేసే ఒక గ్యాంగ్ ని పట్టుకునే నేపథ్యంలో కథానాయికలు ఇద్దరూ కూడా వారిపై పోరాటం సాగించే కథగా ఈ మూవీ తెరకెక్కినట్లు ట్రైలర్ ని బట్టి మనకు కొంత అర్ధం అవుతుంది. ఇక ట్రైలర్ లో విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఇంటెన్స్ యాక్షన్, ఫైట్స్ బాగున్నాయి. మొత్తంగా ఈ థియేట్రికల్ ట్రైలర్ శాకినీ ఢాకిని మూవీ పై ఇప్పటివరకు ఉన్న అంచనాలు మరింతగా పెంచింది అనే చెప్పాలి. కాగా ఈ మూవీని సెప్టెంబర్ 16 న విడుదల చేయనున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :