రాజమౌళి “RRR” పై ఐకానిక్ దర్శకుడు శంకర్ కీలక కామెంట్స్.!

Published on Mar 26, 2022 7:08 am IST

మన ఇండియన్ సినిమాని ఎప్పుడో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో సెట్ చేసిన దర్శకుడు శంకర్ అని అందరికీ తెలిసిందే. అలాగే ఇప్పుడు తెలుగు సినిమాని మరియు మన భారతీయ సినిమాని ప్రపంచ స్థాయిలో మరో స్థాయిలో నిలబెట్టిన దర్శకుడు రాజమౌళి. తన గ్రేట్ విజన్ తో గ్రాండియర్ కి సరైన ఎమోషన్స్ ని జోడిస్తూ ఇండియాస్ టాప్ దర్శకుడు గా ఇప్పుడు నిలిచారు. మరి లేటెస్ట్ గా తన భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం” కి మళ్లీ దేశ వ్యాప్తంగా అదిరే రెస్పాన్స్ వస్తుంది. ఇదిలా ఉండగా ఈ లిస్ట్ లో దర్శకుడు శంకర్ చేరారు.

ఈ సినిమాపై కీలక కామెంట్స్ చేస్తూ.. RRR కి ఒక కొత్త అర్ధాన్ని వివరిస్తూ మాకు ఒక అదిరిపోయే అనుభూతి ని ఇచ్చినందుకు చిత్ర యూనిట్ అందరికీ చాలా థాంక్స్, రామ్ చరణ్ రేజింగ్ పెర్ఫార్మన్స్ మరియు తన స్క్రీన్ ప్రెజెన్స్ అలాగే కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ఎమోషనల్ పెర్ఫార్మన్స్ లు నిలిచిపోతాయని. మీ ఊహా శక్తి అతీతమైనది హ్యాట్సాఫ్ మహా ‘రాజమౌళి’ గారు అంటూ కీలక కామెంట్స్ చెయ్యడం ఆసక్తిగా మారగా.. రామ్ చరణ్ తో ఇదే శంకర్ చేస్తున్న నెక్స్ట్ సినిమా విషయంలో చరణ్ అభిమానులు మరింత ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నారు.

సంబంధిత సమాచారం :