మరో తమిళ్ సినిమా రైట్స్ దక్కించుకున్న శరత్ !
Published on Nov 16, 2017 11:22 am IST

పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడు, మిత్రుడు శరత్ మరార్ నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ‘సద్దార్ గబ్బర్ సింగ్’ ‘కాటమరాయుడు’ సినిమాలను నిర్మించిన సంగతి తెలిసిందే. తాజాగా తమిళ్ హీరో విజయ్ నటించిన ‘అదిరింది’ చిత్రాన్ని తెలుగులో విడుదల చేశారు. ఈ సినిమా మౌత్ టాక్ తో మంచి వసూళ్లను సాధిస్తోంది.

శరత్ మరాట్ ఇప్పుడు మరో తమిళ సినిమా డబ్బింగ్ రైట్స్ దక్కించుకున్నారు. నయనతార ప్రధాన పాత్రలో నటించిన ‘అరామ్’ సినిమా ఇటీవల తమిళంలో విడుదలై మంచి విజయం సాధించింది. రజినీకాంత్ సినిమా చూసి నయన్ నటనను మెచ్చుకున్నాడు. ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో నయన్ నటనకు ప్రేక్షకులు ఆధారిస్తోన్నారు.

 
Like us on Facebook