గూస్ బంప్స్ తెప్పిస్తున్న షారుఖ్ ఖాన్ “పఠాన్” టీజర్!

గూస్ బంప్స్ తెప్పిస్తున్న షారుఖ్ ఖాన్ “పఠాన్” టీజర్!

Published on Nov 2, 2022 12:30 PM IST

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ పుట్టిన రోజు సందర్భంగా బాలీవుడ్ సినిమా పఠాన్ టీజర్ ఈరోజు విడుదలైంది. గ్రే షేడ్స్‌తో టైటిల్ రోల్‌లో నటించాడు ఈ బాలీవుడ్ బాద్షా. టీజర్ ఆద్యంతం అద్భుతంగా ఉంది. మరియు యాక్షన్ సీక్వెన్స్‌లతో టీజర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. శత్రువులను అంతమొందించడానికి ఒక గూఢచారి యొక్క కమ్ బ్యాక్ ను టీజర్ లో చూపించడం జరిగింది.

టీజర్‌లో కథాంశం వెల్లడి కాలేదు. షారుఖ్ ఖాన్ మరియు జాన్ అబ్రహం మధ్యన ఉన్న సన్నివేశాలు, దీపిక యాక్షన్ మరియు ఇతర విన్యాసాలు టీజర్‌ను ఆసక్తికరంగా మార్చాయి. ఈ టీజర్‌తో సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన పఠాన్ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తోంది. ఈ యాక్షన్ డ్రామాను రూపొందించడానికి మేకర్స్ చాలా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. విశాల్ – శేఖర్ ఈ బిగ్గీకి సౌండ్‌ట్రాక్‌లను కంపోజ్ చేశారు, జనవరి 25, 2023 న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్‌లలో హిందీ, తెలుగు మరియు తమిళంలో గ్రాండ్ రిలీజ్ కానుంది.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు