విషాదం : స్టార్ హీరో తండ్రి కన్నుమూత.!

Published on Mar 24, 2023 9:21 am IST

కోలీవుడ్ సినిమా దగ్గర భారీ క్రేజ్ ఉన్నటువంటి బిగ్గెస్ట్ స్టార్ హీరోస్ లో థలా అజిత్ కుమార్ కూడా ఒకరు. మరి అజిత్ హీరోగా నటించిన రీసెంట్ సినిమా “తునివు” తో తన కెరీర్ లో మరో భారీ హిట్ ని కూడా తాను అందుకోగా ఇప్పుడు నెక్స్ట్ సినిమా స్టార్ట్ కి సిద్ధంగా ఉన్నారు. మరి ఆ సినిమా కోసం ఎన్నో రోజులు నుంచి ఎదురు చూస్తున్న అజిత్ కుమార్ అభిమానులకి షాకింగ్ వార్త అయితే ఇప్పుడు విషాదంగా మారింది.

తమ అభిమాన హీరో నటుడు తండ్రి ఇక లేరు అనే వార్త ఇప్పుడు కోలీవుడ్ సినీ వర్గాల్లో విషాదంగా మారింది. మరి అజిత్ తండ్రి సుబ్రమణియన్ ఈరోజు చెన్నై లో తన తుది శ్వాస విడిచినట్టుగా వార్తలు కన్ఫర్మ్ అయ్యాయి. దీనితో కోలీవుడ్ సినీ వర్గాలు దిగ్భ్రాంతికి లోను కాగా అజిత్ కుమార్ కు తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అలాగే అభిమానులు అయితే మరింత విషాదం వ్యక్తం చేస్తున్నారు. మరి వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మా 123తెలుగు యూనిట్ ఆకాంక్షిస్తుంది.

సంబంధిత సమాచారం :