రియా, సుశాంత్ డబ్బు మాయం చేసిందన్న అంశంలో ట్విస్ట్.!

Published on Aug 13, 2020 4:05 pm IST

గత కొంత కాలం నుంచి బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ హత్యా ఘటన ఎన్ని మలుపులు తిరుగుతూ వస్తుందో అందరికీ తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి బాలీవుడ్ కు చెందిన చాలా మంది బడా వ్యక్తుల పైనే అనేక ఆరోపణలు వస్తున్నాయి. అలాగే మరింత మంది పేర్లు కూడా బయటకు వస్తున్నాయి.

అయితే సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి రియా చక్రబర్తిపై మాత్రం మొదటి నుంచీ అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆమె అతని డబ్బును మాయం చేసింది అని అతని బ్యాంకు అకౌంట్ లో నుంచి భారీ మొత్తంలో డబ్బును ఆమె ఖర్చు చేసింది అని ఆరోపణలు ఉన్నాయి.

దీనిపై ఆమెను సిబిఐ వారు విచారణ చెయ్యగా ఊహించని ట్విస్ట్ ఇప్పుడు బయల్పడినట్టు తెలుస్తుంది. గడిచిన రెండు రోజుల్లో ఆమెను మొత్తం 18 గంటల పాటు విచారణ చెయ్యగా ఆమె బ్యాంకు లావాదేవీలను ఆరా తీయగా ఆమెకు ఎలాంటి జాయింట్ అకౌంట్ లేదని అంతే కాకుండా ఈ మధ్య కాలంలో ఎప్పుడూ కూడా ఆమె ఖాతా నుంచి పెద్ద మొత్తంలో డబ్బు ట్రాన్స్ఫర్ అయ్యిన దాఖలాలు లేవని వారు తెలిపారు. దీనితో ఈ అనేక ఆరోపణల నుంచి రియాకు కాస్త ఉపశమనం దొరికిందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :

More