మహేష్ బాబు మూవీ కోసం పాటపాడిన శృతి హాసన్

Published on Jul 26, 2014 10:31 am IST

shruthi-hasan
అందాల భామ శృతి హాసన్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘ఆగడు’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్న సంగతి మేము ఇది వరకే తెలియజేశాం. ఈ పాట షూటింగ్ ఈ రోజు హైదరాబాద్ లో మొదలయ్యింది. శృతి హాసన్ ఈ సినిమాలో ఓ స్పెషల్ పాటలో నర్తించడమే కాకుండా, ఆ పాటని కూడా శృతి హాసనే పాడింది. తను నర్తించే సాంగ్ ని తనే పాడడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది.

ఈ విషయాన్ని థమన్, శృతి హాసన్ లు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ‘తమన్ తో మ్యూజిక్ రికార్డ్ చెయ్యడం చాలా సరదాగా ఉంటుంది. ఇలాంటి పాత పాడడం ఒక డిఫరెంట్ అనుభూతి. రేపటి నుంచే ఇదే పాటని షూట్ చేయనున్నాం’ అని శృతి ట్వీట్ చేసింది. తమన్ మ్యూజిక్ అందించిన ‘రేసు గుర్రం’ సినిమాలో కూడా శృతి హాసన్ చేత ‘డౌన్ డౌన్ డుప్ప’ అనే పాటని పాడించాడు. ఆ పాట చాలా హిట్ అయ్యింది. ఈ ఈ ఐటెం సాంగ్ కూడా యువతని ఓ ఊపు ఊపుతుందేమో చూడాలి.

మహేష్ బాబు సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి శ్రీను వైట్ల దర్శకుడు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :