‘కాటమరాయుడు’ టెన్షన్ తీరిపోయింది..!

12th, October 2016 - 03:10:40 PM

shruti-haasan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న ‘కాటమరాయుడు’ ఈమధ్యే సెట్స్‌పైకి వెళ్ళిన విషయం తెలిసిందే. చాలా నెలల క్రితమే అనౌన్స్ అయిన ఈ సినిమా అనుకోని కారణాలతో వాయిదా పడుతూ వచ్చి ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తైనా కూడా హీరోయిన్ శృతి హాసన్‍కు సంబంధించిన సన్నివేశాలేవీ మొదలవ్వకపోవడంతో అసలు సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారా? లేదా అంటూ అభిమానులు ఆలోచనలో పడిపోయారు.

తాజాగా వీటన్నింటికీ తెరదించుతూ శృతి హాసన్, ‘కాటమరాయుడు’ సెట్లో జాయిన్ అయిపోయారు. హైద్రాబాద్‌లో జరుగుతోన్న షూట్‌లో శృతి హాసన్ ఇవ్వాళే జాయిన్ అయ్యారు. పవన్ కళ్యాణ్ – శృతి హాసన్‍ల కాంబినేషన్‌లో ఇప్పటికే గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ రావడంతో ఈ కాంబినేషన్‌లో మరో హిట్ ఖాయమని అభిమానులు భావిస్తూ వస్తున్నారు. నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శరత్ మరార్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు డాలీ దర్శకత్వం వహిస్తున్నారు.