విమర్శలపై ఘాటుగా సమాధానమిచ్చిన శృతి హాసన్ !


తెలుగు, తమిళ భాషల్లోనే కూడా పాపులారిటీ సంపాదించుకున్న అతి తక్కువ మంది సౌత్ ఇండియన్ హీరోయిన్లలో శృతి హాసన్ కూడా ఒకరు. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ లో చేసిన ‘బెహన్ హోగి తేరి’ సినిమా ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నారు. ఈ ప్రమోషన్లలో భాగంగా హిందీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శృతి హాసన్ తన పై వస్తున్న విమర్శలకి ఘాటైన బదులిచ్చారు.

ఈ మధ్య కాస్త బరువు పెరిగి లావుగా కనిపించడం, పెదాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం వంటి విమర్శలపై ఎలా స్పందిస్తారు అని అడగ్గా ‘సినిమాల్లో బాగా కనిపించడం కూడా మా పనిలో భాగమే. దాని కోసం రకరకాల ప్రయత్నాలు చేయాలి. నేను ఈ సినిమా కోసమే కావాలని బరువు పెరిగాను. ఒక్కోసారి సహజంగా కూడా బరువు పెరుగుతుంది. ఇది నా శరీరం. దానితో నేను ఏం చేస్తాను అనే విషయంతో వేరొకరికి పనిలేదు. నేను కూడా ఎవరో చేసిన కామెంట్స్ ని పట్టించుకోను’ అంటూ తెలివైన సమాధానమిచ్చారు.