ఓవర్సీస్ లో “శ్యామ్ సింగ రాయ్” స్ట్రాంగ్ వసూళ్లు.!

Published on Dec 26, 2021 11:00 am IST

నాచురల్ స్టార్ నాని హీరోగా టాలెంటెడ్ దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించిన లేటెస్ట్ సినిమా “శ్యామ్ సింగ రాయ్” మొన్న శుక్రవారం విడుదల అయ్యి అన్ని వర్గాల ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ని ఈ చిత్రం అందుకుంది. అయితే ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్ లో ఈ చిత్రం మంచి హోల్డ్ ని కనబరుస్తుంది.

నాని కెరీర్ లో డీసెంట్ ప్రీమియర్స్ అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు 4 లక్షల డాలర్స్ మార్క్ ని స్ట్రాంగ్ వసూళ్లు ఈ రెండు రోజుల్లో అందుకుంది. ఇక ఈ చిత్రం వసూళ్లతోనే కాకుండా మరిన్ని లొకేషన్స్ లో స్క్రీన్స్ ని కూడా యాడ్ చేస్తున్నారట. దీనితో శ్యామ్ సింగ రాయ్ మరో బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ హిట్ గా కొనసాగుతుంది. మరి ఈ చిత్రంలో సాయి పల్లవి మరియు కృతి శెట్టి లు హీరోయిన్స్ గా నటించారు. అలాగే మిక్కీ జె మేయర్ సంగీతం అందివ్వగా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :