సాలిడ్ రెస్పాన్స్ తో “శ్యామ్ సింగ రాయ్” టీజర్.!

Published on Nov 19, 2021 9:04 am IST


నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “శ్యామ్ సింగ రాయ్”. టాలెంటెడ్ దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించిన ఈ చిత్రం ఎంత డిఫరెంట్ అనుభూతిని ఇచ్చిందో నిన్న టీజర్ రిలీజ్ తర్వాత చూసిన వాళ్ళని ఎవరిని అడిగినా చెప్తారు. ఇప్పటి వరకు మన టాలీవుడ్ సినిమాల నుంచి వచ్చిన టీజర్స్ ని వేరు చేస్తూ పూర్తిగా కొత్త ఎక్స్ పీరియన్స్ ని ఈ టీజర్ అందరికీ ఇచ్చింది.

అందుకే ఇప్పుడు ఈ టీజర్ సాలిడ్ రెస్పాన్స్ తో దూసుకెళ్తుంది. లేటెస్ట్ గా ఈ టీజర్ రియల్ టైం లో 5 మిలియన్ వ్యూస్ ని ఇప్పుడు క్రాస్ చేసేసింది. అంతే కాకుండా 2 లక్షల 40 వేలకి పైగా లైక్స్ మరియు యూట్యూబ్ లో నెంబర్ 1 ప్లేస్ లో ఈ టీజర్ ట్రెండ్ అవుతుంది. మరి ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి లు హీరోయిన్స్ గా నటించగా మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు. అలాగే నిహారిక ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :

More