రేపు సిరివెన్నెల అంత్యక్రియలు..!

Published on Nov 30, 2021 11:00 pm IST


ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి న్యూమోనియాతో బాధపడుతూ ఈ నెల 24న కిమ్స్‌ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ రోజు సాయంత్రం తుదిశ్వాస విడిచారు. అయితే సిరివెన్నెల గారి పార్థివదేహం ఈ రోజు కిమ్స్ ఆసుపత్రిలోనే ఉంటుంది.

రేపు ఉదయం 7 గంటల నుంచి అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖుల సందర్శన కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతిక కాయాన్ని తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో ఉంచనున్నారు. అనంతరం మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

సంబంధిత సమాచారం :