“సీతారామం” కి అక్కడ మంచి ఓపెనింగ్స్..?

Published on Aug 2, 2022 4:04 pm IST


ప్రస్తుతం టాలీవుడ్ నుంచి డీసెంట్ బజ్ మరియు మంచి ప్రమోషన్స్ తో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న చిత్రాల్లో మళయాళ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా అలాగే రష్మికా మందన్నా ఒక కీలక పాత్రలో నటించిన అవైటెడ్ చిత్రం “సీతారామం” కూడా ఒకటి. తెలుగు రాష్ట్రాల్లో మంచి ప్రమోషన్స్ ని జరుపుకుంటున్న ఈ చిత్రంకి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు.

మరి ఈ చిత్రం విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న మేకర్స్ రిలీజ్ పనుల్లో బిజీగా ఉండగా ఈ సినిమాకి అయితే ఓవర్సీస్ లో మంచి ఓపెనింగ్స్ దక్కే అవకాశం ఉన్నట్టుగా ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. రీసెంట్ గా వచ్చిన పలు సౌత్ సినిమాల కన్నా బెటర్ ఓపెనింగ్స్ అయితే ఈ సినిమాకి దక్కే అవకాశం ఉందని ఇప్పుడు తెలుస్తుంది. మరి వీటికి తోడు సినిమాకి కూడా మంచి టాక్ వస్తే ఓవర్సీస్ లో మంచి నంబర్స్ ని ఈ చిత్రం నమోదు చేస్తుందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :