‘రామారావు ఆన్ డ్యూటీ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి గెస్టులుగా ఆరుగురు డైరెక్టర్లు …!

Published on Jul 16, 2022 12:30 am IST

మాస్ మహారాజ రవితేజ లేటెస్ట్ మూవీ రామారావు ఆన్ డ్యూటీ. వాస్తవ ఘటనల ఆధారంగా రవితేజ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరినీ ఆకట్టుకునేలా మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ గా యువ దర్శకుడు శరత్ మండవ ఈ మూవీని తెరకెక్కించారు. శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ మూవీకి సామ్ సి మ్యూజిక్ అందించగా రవితేజ కి జోడిగా రాజీషా విజయన్, దివ్యాంశ కౌశిక్ నటించారు. రవితేజ ఒక గవర్నమెంట్ అధికారిగా నటిస్తున్న ఈ మూవీ సాంగ్స్ ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజ్ అయి మంచి రెస్పాస్ సొంతం చేసుకున్నాయి.

ఇక ఈ మూవీ యొక్క థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని రేపు సాయంత్రం 6 గంటల నుండి హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో నిర్వహించనుండగా ఈ ఈవెంట్ కి స్పెషల్ గెస్టులు గా టాలీవుడ్ కి చెందిన ఆరుగురు డైరెక్టర్స్ రానున్నారు. కాగా వారు త్రినాధరావు నక్కిన, అనిల్ రావిపూడి, సుధీర్ వర్మ, వంశీ కృష్ణ నాయుడు, గోపీచంద్ మలినేని, బాబీ. రేపు ట్రైలర్ రిలీజ్ తరువాత మూవీ పై అందరిలో అంచనాలు మరింతగా పెరగడం ఖాయం అని, అలానే ఈనెల 29న రిలీజ్ కానున్న రామారావు ఆన్ డ్యూటీ మూవీ కూడా ఆడియన్స్ ని ఆకట్టుకోవడం ఖాయం అని అంటోంది యూనిట్.

సంబంధిత సమాచారం :