నైజాంలో “దసరా” కి సాలిడ్ బుకింగ్స్.!

Published on Mar 29, 2023 12:05 am IST


నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా “దసరా” కోసం తెలిసిందే. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ సినిమాలో వెన్నెల గా కీర్తి సురేష్ నటించగా ఇప్పుడు మొత్తం చిత్ర యూనిట్ అంతా కూడా నిర్విరామంగా పాన్ ఇండియా వైడ్ గా అగ్రెసివ్ ప్రమోషన్స్ ని చేస్తున్నారు.

అయితే ఈ సినిమాకి చేస్తున్న భారీ ప్రమోషన్స్ తో హైప్ ని అలా మేకర్స్ కొనసాగిస్తున్నారు. రిలీజ్ కి సమయం దగ్గర పడుతుండడంతో మాసివ్ బుకింగ్స్ దసరా కి సెట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. మరి నైజాం లో అయితే దసరా మ్యానియా గట్టిగా ఉండనున్నట్టుగా తెలుస్తుంది.

ఆల్రెడీ బుకింగ్స్ టైర్ 2 హీరోస్ లో అయితే టాప్ లో ఉండగా రిలీజ్ డే కి మరింత స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనితో అయితే టైర్ 2 లో రికార్డు నంబర్స్ నమోదు కావడం ఖాయం ని టాక్. మరి దసరా సెన్సేషన్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా ఎస్ ఎల్ వి సినిమాస్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :