“మహేష్ 28” ఫస్ట్ లుక్ పై సాలిడ్ బజ్.!

Published on Feb 24, 2023 11:01 pm IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మన యంగ్ హీరోయిన్ శ్రీ లీల మరియు పూజా హెగ్డే లు హీరోయిన్స్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం కోసం తెలిసిందే. మరి భారీ బడ్జెట్ తో చేస్తున్న ఈ ప్రాజెక్ట్ పై అనేక అంచనాలు నెలకొనగా పలు ఇబ్బందులు తర్వాత ఫైనల్ గా ఫుల్ ఫ్లెడ్జ్ షూటింగ్ లోకి అయితే దిగింది.

మరి ఈ సినిమా నుంచి అయితే ఆల్రెడీ ఈ ఉగాది కానుకగా మేకర్స్ అదిరే ట్రీట్ లు రెడీ చేస్తున్నట్టుగా బజ్ వచ్చింది. ఇప్పుడు దీనికి అదనంగా మరింత ఇంట్రెస్టింగ్ టాక్ అయితే వినిపిస్తుంది. ఈ ఉగాది కానుకగా టైటిల్ తో పాటుగా సూపర్ స్టార్ మహేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్టుగా సినీ వర్గాలు ఇప్పుడు చెప్తున్నాయి. మరి దీనిపై అధికారిక అప్డేట్ ఏమన్నా వస్తుందేమో చూడాలి. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :