“లా లా భీమ్లా”..థర్డ్ సింగిల్ పై ఎనలేని హైప్.!

Published on Oct 29, 2021 11:30 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటిల కాంబోలో తెరకెక్కుతున్న క్రేజీ రీమేక్ అండ్ మల్టీ స్టారర్ చిత్రం “భీమ్లా నాయక్”. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం ఇప్పుడు శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాపై చిత్ర యూనిట్ ఎప్పటికప్పుడు అదిరే అప్డేట్స్ ని రివీల్ చేస్తూ వస్తుండగా నిన్న రెండు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ని తెలియజేసారు.

వాటిలో భీమ్లా నాయక్ థర్డ్ సింగిల్ కూడా ఒకటి. లాస్ట్ టైం ఈ సినిమా గ్లింప్స్ లో విన్న భీమ్లా టైటిల్ ట్యూన్ ఇప్పుడు విన్నా కూడా ప్రతీ ఒక్కరికీ సాలిడ్ ఎనర్జీ వస్తుంది. మరి ఇపుడు దానిని చిత్ర యూనిట్ రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు..

ఇక ఈ అనౌన్సమెంట్ రావడంతోనే ఈ మాస్ సింగిల్ పై హైప్ ఒక లెక్కలో వచ్చేసింది. డెఫినెట్ గా భారీ రెస్పాన్స్ అందుకునే మరో సాంగ్ గా ఈ సినిమా నుంచి నిలుస్తుంది అని అంతా ఫిక్స్ కూడా అయ్యిపోయారు. మరి థమన్ కొట్టిన ఈ అవైటెడ్ ఆల్రెడీ చార్ట్ బస్టర్ సాంగ్ ని మేకర్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :

More