యూఎస్ లో “యశోద” కి అద్దిరిపోయే ఓపెనింగ్స్.!

యూఎస్ లో “యశోద” కి అద్దిరిపోయే ఓపెనింగ్స్.!

Published on Nov 12, 2022 10:00 AM IST

స్టార్ హీరోయిన్ సమంత నుంచి ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో పాన్ ఇండియా ప్రాజెక్ట్ “యశోద” కూడా ఒకటి. దర్శకులు హరి – హరీష్ లు తెరకెక్కించిన ఈ చిత్రం సాలిడ్ కాన్సెప్ట్ తో తెరకెక్కి టీజర్ మరియు ట్రైలర్స్ తో ఎంతో ఆసక్తి రేపింది. ఇక మంచి అంచనాలు సామ్ కి పలు ఇబ్బందులు ఉన్నప్పటికీ దాటుకొని రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రానికి సామ్ మరియు మేకర్స్ కష్టానికి ఆడియెన్స్ సూపర్ రెస్పాన్స్ ని అయితే అందించారు.

మరి యూఎస్ లో అయితే ఈ చిత్రం సాలిడ్ ఓపెనింగ్స్ అందుకున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడి ప్రీమియర్స్ తోనే ఈ చిత్రం 65 వేల డాలర్స్ కి పైగా వసూలు చేయగా మొదటి రోజుకి అయితే ఏకంగా 2 లక్షల డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసి అదరగొట్టింది. దీనితో యశోద చిత్రానికి మున్ముందు సాలిడ్ నంబర్స్ నమోదు చేయడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. అయితే మణిశర్మ సంగీతం అందివ్వగా శ్రీదేవి మూవీస్ వారు మంచి బడ్జెట్ తో నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు