బాలయ్య మాస్ నెంబర్ కి అదిరే రెస్పాన్స్.!

Published on Nov 30, 2021 7:58 am IST


నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రం “అఖండ”. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఎట్టకేలకు ఇప్పుడు రిలీజ్ అవుతుంది. మరి ఇదిలా ఉండగా ఈ భారీ సినిమా రిలీజ్ కి దగ్గర తరుణంలో మేకర్స్ భారీ ప్రీ రిలీజ్ పెట్టి మరింత అటెన్షన్ ని తెచ్చారు.

అలాగే ఇందులోనే ఓ కొత్త పాటని కూడా సర్ప్రైజింగ్ గా రిలీజ్ చేశారు.
ఇదే “జై బాలయ్య” సాంగ్. బాలయ్య మరియు ప్రగ్యా లపై డిజైన్ చేసిన ఈ మాస్ నెంబర్ అనుకోకుండా రిలీజ్ చేసినా అదిరే రెస్పాన్స్ ని అయితే ఇప్పుడు అందుకుంటుంది.

ఇప్పుడు ఏకంగా 8 మిలియన్ ప్లస్ వ్యూస్ మార్క్ ని క్రాస్ చేసి దూసుకెళ్తుంది. ఆల్రెడీ ఈ సాంగ్ కి థమన్ బీట్స్ మంచి ప్లస్ అవ్వగా దానికి బాలయ్య వేసిన స్టెప్పులు ఇంకా అట్రాక్షన్ గా నిలిపాయి. ఇక బిగ్ స్క్రీన్ పై టోటల్ సాంగ్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే వచ్చే డిసెంబర్ 2 వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :