భారీ ధరకు అమ్ముడైన ‘స్పైడర్’ హక్కులు !


రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ‘స్పైడర్’ టీమ్ ప్రమోషన్ల జోరు పెంచింది. ఇంతకు ముందే సాంగ్ టీజర్ ను రిలీజ్ చేసిన యూనిట్ ఆ తర్వాత మూవీ స్టిల్స్ ఒక్కొక్కటిగా వదులుతూ వార్తల్లో నిలుస్తోంది. అంతేగాక ఈరోజు ఆడియోలో మొదటి పాటను విడుదలచేయనున్నారు. ఇకపోతే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు ఊహించని భారీ ధరకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది.

ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఒకటి సుమారు రూ.15.2 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించి ఈ హక్కుల్ని కొనుగోలు చేసిందట. మహేష్ కెరీర్లో ఇదే భారీ డీల్ కావడం విశేషం. సాధారణంగానే మహేష్ సినిమాలాంటే ఎక్కువగా ఉండే క్రేజ్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తుండటంతో రెట్టింపైంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా రూపొందిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఇకపోతే హారీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ హీరోయిన్ గా కనిపించనుంది.