‘బాహుబలి’ తర్వాత ఆ ఘనత ‘స్పైడర్’ కే దక్కింది !


మహేష్ – మురుగదాస్ ల ‘స్పైడర్’ పై ప్రేక్షకుల్లో, సినీ వర్గాల్లో ముందు నుండి ఉన్న అంచనాల ప్రకారమే ప్రీ – రిలీజ్ బిజినెస్ తారా స్థాయిలో జరిగింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ బిజినెస్ సుమారు రూ.150 కోట్ల వరకు జరిగినట్టు అంచనా. ‘బాహుబలి-1,2’ తర్వాత ఇంత స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమా ఇదే కావడం విశేషం.

సినిమా థియేట్రికల్ రైట్స్ ప్రపంచవ్యాప్తంగా రూ. 120 కోట్లకు అమ్ముడవగా ఇతర శాటిలైట్, ఆడియో హక్కులు ఇంకో రూ.30 కోట్లకు అమ్ముడయ్యాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లో ఈ బిజినెస్ రూ. 69 కోట్ల వరకు జరిగినట్టు సమాచారం. ఈ నెల 27న తేదీన రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, అరబిక్ వంటి పలు భాషల్లో విడుదలచేస్తున్నారు. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ స్పై థ్రిల్లర్ లో ఎస్.జె సూర్య ప్రధాన ప్రతినాయకుడిగా కనిపించనున్నారు.