వ్యూస్ పరంగా సరికొత్త రికార్డ్ సృష్టించిన ‘స్పైడర్’ !
Published on Aug 10, 2017 8:38 am IST


సూపర్ స్టార్ మహేష్ బాబు ‘స్పైడర్’ టీజర్ భారీ అంచనాల నడుమ నిన్న ఉదయం 9 గంటల సమయంలో విడుదలైన సంగతి తెల్సిందే. ఈ టీజర్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న అభిమానులు రిలీజైన కొద్దిసేపటికే దాన్ని టాప్ ట్రెండింగ్స్ లో నిలబెట్టేశారు. దీంతో టీజర్ ఊహించిన దానికంటే భారీ వ్యూస్ దక్కించుంది.

పూర్తిగా 24 గంటలు కూడా గడవకముందే ఈ టీజర్ కు అన్ని మాధ్యమాల్లో కలిపి 8.6 మిలియన్ల డిజిటల్ వ్యూస్ దక్కాయి. ఇలా టీజర్ తోనే రికార్డులు సృష్టించడం మొదలుపెట్టిన మహేష్ సినిమా విడుదల తర్వాత ఎలాంటి ఫలితాలు చూపిస్తాడో చూడాలి. మరోవైపు టీజర్ బాగా ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ స్పై థ్రిల్లర్ ను సెప్టెంబర్ 27న రిలీజ్ చేయనున్నారు.

 
Like us on Facebook