నెట్ ఫ్లిక్స్ క్రేజ్ ని పెంచుతున్న ‘స్క్విడ్ గేమ్’ సిరీస్!

Published on Oct 21, 2021 6:40 pm IST

ప్రపంచ వ్యాప్తంగా కూడా అతిపెద్ద స్ట్రీమింగ్ సంస్థ ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా అంతా నెట్ ఫ్లిక్స్ అనే చెప్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. అలాగే వీరిపై ఉన్న నమ్మకానికి తగ్గట్టు గానే ఈ దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ ఎప్పటికపుడు అత్యంత నాణ్యమైన కంటెంట్ ను అందిస్తూ స్ట్రీమింగ్ వీక్షకులను అలరిస్తారు. మరి ఇందులో ఉన్న ఎన్నో గ్లోబల్ హిట్ వెబ్ సిరీస్ ల జాబితాలో లేటెస్ట్ కొరియన్ సెన్సేషన్ “స్క్విడ్ గేమ్” కూడా చేరింది.

జస్ట్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యిన నెల రోజులకే రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ తెచ్చుకొని ఆల్ టైం నెంబర్ 1 గా నిలిచిన ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ క్రేజ్ ను కూడా మరింత పెంచినట్టు తెలుస్తుంది. ఈ సిరీస్ ను నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేసాక వారికి కొత్తగా 40 లక్షల మంది కొత్త సబ్ స్క్రైబర్స్ వచ్చారట. దీనిని బట్టి స్క్విడ్ గేమ్ హవా ఏ రేంజ్ లో ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. మరి భవిష్యత్తులో ఈ హిట్ సిరీస్ ని తెలుగు లో కూడా తీసుకొస్తారేమో అన్నది చూడాలి.

సంబంధిత సమాచారం :

More