వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా శ్రీదేవి సోడా సెంటర్… టైమ్ లో మార్పు!

Published on Dec 8, 2021 3:30 pm IST

సుధీర్ బాబు, ఆనంది హీరో హీరోయిన్ లుగా కరుణ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. థియేటర్ల లో విడుదల అయ్యి సూపర్ హిట్ అయిన ఈ చిత్రం ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతుంది

ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 12 వ తేదీన ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు జీ తెలుగు లో ప్రసారం కానుంది. ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి విజయం సాధిస్తుంది అనేది చూడాలి.

సంబంధిత సమాచారం :