శ్రీదేవి చిత్రానికి కూడా ఆ ఇబ్బంది తప్పలేదు !


శ్రీదేవి నటిస్తున్న తాజా చిత్రం ‘మామ్’ కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ చిత్రం లో పాకిస్తానీ నటులను తీసుకోవాలని ఆమె కుమార్తె బోనికపూర్ కు సలహా ఇచ్చింది. ఇది వరకే ఈ విషయాన్ని తెలియజేశాం. కాగా మామ్ చిత్రంలో పాకిస్తానీ నటులను తీసుకోవడమే ఇప్పుడు సమస్యగా మారింది.

పాకిస్థానీ నటులను ఇండియా లో నిషేధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం లో ఇద్దరు పాకిస్థానీ నటులను తీసుకున్నారు. దీనితో పలు నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తానీ నటులు సాజల్ అలీ, అద్నాన్ సిద్దిఖీ లు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో వీరు కీలక పాత్రలను పోషిస్తున్నారు. కాగా ప్రమోషన్ కార్యక్రమాల్లో వీరిని పాల్గొననీయమని కొందరు హెచ్చరిస్తున్నారు. చిత్రయూనిట్ మాత్రం పాకిస్తానీ నటులను బ్యాన్ చేయడానికంటే ముందే వీరిని తమ చిత్రం లో తీసుకున్నామని చెబుతున్నారు.