షారుఖ్ “పఠాన్” లేటెస్ట్ వసూళ్లు ఇవే!

Published on Feb 16, 2023 6:31 pm IST


బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ పఠాన్. ఈ చిత్రం కి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే హీరోయిన్ గా నటించింది. జాన్ అబ్రహం సినిమాలో విలన్ గా నటించాడు. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం ఊహించని రీతిలో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

ఈ చిత్రం బాలీవుడ్ నుండి 500 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లను రాబట్టిన చిత్రం గా నిలిచింది. నిన్న మరో 3.5 కోట్ల రూపాయల కి పైగా వసూళ్లను రాబట్టగా, ఇప్పటి వరకూ హిందీ లో 485 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అదే విధంగా తెలుగు, తమిళ భాషల్లో 17 కోట్ల రూపాయల కి పైగా వసూళ్లను రాబట్టింది. వరల్డ్ వైడ్ గా ఈ వసూళ్లు ఇంకా భారీగా ఉండనున్నాయి. ఈ చిత్రం లాంగ్ రన్ లో ఆల్ టైమ్ హిట్ బాహుబలి 2 ను క్రాస్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వీకెండ్ కి ఇదే జోరు కొనసాగితే ఈ రికార్డ్ కూడా ఖాయం.

సంబంధిత సమాచారం :