15 ఏళ్ళ సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న రాజమౌళి

15 ఏళ్ళ సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న రాజమౌళి

Published on Sep 27, 2016 2:33 PM IST

Rajamouli-1
ఈనాటి తెలుగు పరిశ్రమలోని టాప్ దర్శకుల్లో నెం. 1 స్థానంలో ఉన్న దర్శక ధీరుడు, జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి ఈరోజుతో దర్శకుడిగా పరిశ్రమలోకి వచ్చి 15 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు. 2001 సెప్తేమ్బర్ 27న ‘స్టూడెంట్ నెం 1’ చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన ఇప్పటి వరకూ 10 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇండియాలోనే నూటికి నూరు శాతం సక్సెస్ రేట్ ఉన్న ఒకేఒక్క దర్శకుడు రాజమౌళి. ఈయన డైరెక్ట్ చేసిన అన్ని సినిమాలు వేటికవే సపరేట్ ఇమేజ్ సొంతం చేసుకున్నాయి.

ముఖ్యంగా ఆయన తీసిన ‘బాహుబలి – ది బిగినింగ్’ చిత్రం అయితే బ్రహ్మాండమైన విజయం సాదించి విడుదలైన అన్ని భాషల్లోనూ హిట్ గా నిలిచి దాదాపు రూ.600 కోట్ల వసూళ్లు రాబట్టింది. దీంతో జక్కన్న కీర్తి దేశవ్యాప్తమైంది. అంతేగాక రాజమౌళి ఈ మధ్య ‘పద్మ శ్రీ’ అవార్డును కూడా పొందారు. సన్నివేశాలను ఎమోషనల్ గా ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా తీయడం, బలమైన స్క్రీన్ ప్లే, చిత్రాన్ని భారీ స్థాయిలో ఊహించగల ఊహా శక్తి, కమర్షియల్ విలువలను పక్కాగా పాటించడం, ఖర్చుకు తగ్గట్టు సినిమాలో కంటెంట్ ఉండేలా చూసుకోవడం రాజమౌళికున్న ప్రధాన బలాలుగా చెప్పుకోవచ్చు. ఇకపోతే ప్రస్తుతం ఈయన ‘బాహుబలి – 2’ ను చిత్రీకరించే పనిలో ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు