రాజమౌళి మల్టీస్టారర్ గురించి లేటెస్ట్ అప్ డేట్స్ !

Published on Oct 24, 2018 7:50 pm IST

దర్శకధీరుడు రాజమౌళి, ఎన్టీఆర్ – రామ్ చరణ్ లతో కలిసి ఓ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ను తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ‘బాహుబలి’ తరవాత ఆయన చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ఎన్టీఆర్ – చరణ్ ఇద్దరూ రెండు వందల రోజుల డేట్స్ ను కేటాయించనున్నారని, ఆ మేరకు స్క్రిప్ట్ ని కూడా రాజమౌళి అంతే స్థాయిలో సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్న ఈ చిత్రంలో హీరోల రెమ్యూనరేషన్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఈ సినిమాలో ఎన్టీఆర్, జక్కన్న, చరణ్ ఎవ్వరూ రెమ్యూనరేషన్ తీసుకోవట్లేదట.. సినిమా లాభాల్లో వాటా తీసుకోనున్నారని సమాచారం. ఇక ఈ చిత్రం కోసం ప్రముఖ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా ఒక వెర్షన్ డైలాగ్స్ ని ఇప్పటికే పూర్తి చేసారని తెలుస్తోంది.

ఈ చిత్రం నవంబర్ మూడో వారం నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :