SSMB28 : నెక్స్ట్ షెడ్యూల్ మరింత ఆలస్యం కానుందా ?

SSMB28 : నెక్స్ట్ షెడ్యూల్ మరింత ఆలస్యం కానుందా ?

Published on Dec 9, 2022 10:02 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో SSMB28 వర్కింగ్ టైటిల్ తో ఒక ప్రతిష్టాత్మక మూవీ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతుండగా ఇందులో మహేష్ బాబు పక్కా మాస్ పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల ఫస్ట్ షెడ్యూల్ జరుపుకున్న ఈ మూవీ, సీనియర్ లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ గారి హఠాన్మరణంతో సెకండ్ షెడ్యూల్ కొన్నాళ్ల పాటు వాయిదా పడింది.

అయితే ఈ ప్రతిష్టాత్మక మూవీ సెకండ్ షెడ్యూల్ ని డిసెంబర్ రెండవ వారంలో స్టార్ట్ చేస్తారని ఇటీవల వార్తలు రాగా, అది మరికొన్నాళ్లు పాటు వాయిదా పడిందని, అతి త్వరలో త్రివిక్రమ్, నిర్మాత నాగ వంశీ, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ లతో సూపర్ స్టార్ మహేష్ ఈ మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం దుబాయ్ వెళ్లనున్నారని, అక్కడ ట్యూన్స్ పక్కాగా సెట్ అయిన తరువాత జనవరి మొదటి వారంలో మూవీ యొక్క సెకండ్ షెడ్యూల్ ప్రారంభించనున్నారని అంటున్నారు. అయితే SSMB28 మూవీ సెకండ్ షెడ్యూల్ పై ఈ విధంగా కథనాలు ప్రచారం అవుతుండడంతో పక్కాగా షూటింగ్ గురించి డీటెయిల్స్ తెలియాలి అంటే మాత్రం యూనిట్ నుండి అఫీషియల్ గా న్యూస్ రావాల్సిందే అని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు