డ్రీమ్ ప్రాజెక్ట్ ని పూర్తి చేసిన స్టార్ హీరో!
Published on Feb 28, 2017 11:42 am IST


తమిళ స్టార్ హీరో ధనుష్ తనలో గొప్ప నటుడే కాకుండా దర్శకుడు కూడా ఉన్నాడని చెప్పడానికి ‘పవర్ పాండి’ అనే చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ధనుష్ ఈ సినిమాని డైరెక్ట్ చేయడమే కాక స్వయంగా రచించి, నిర్మిస్తున్నారు కూడా. 2016 లో మొదలైన ఈ చిత్ర షూటింగును ధనుష్ ఒకవైపు తన వేరే సినిమాల్లో నటిస్తూనే అనుకున్న సమయానికి పూర్తి చేస్తూ నిన్నటితో ముగించేశారు.

ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా చెబుతూ ‘పవర్ పాండి షూటింగ్ పూర్తయింది. నా కల నెరవేరడానికి నాకు సహాయపడిన, సపోర్ట్ చేసిన వారందరికీ నా కృతజ్ఞతలు’ అన్నారు ధనుష్. వండర్ బార్ ఫిలిమ్స్ పతాకంపై రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో రాజకిరణ్ ప్రధాన పాత్రలో నటించగా గౌతమ్ మీనన్, ధనుష్ లు గెస్ట్ రోల్స్ లో కనిపించనున్నారు. ఇకపోతే ఈ సినిమా యొక్క ఆడియో వేడుకను మార్చి 9న నిర్వహించి ఏప్రిల్ 14న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

 
Like us on Facebook