‘మా’ ఎన్నికల్లో ఓటు వేయని స్టార్స్ వీళ్ళే !

Published on Oct 10, 2021 8:00 pm IST

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియలో చాలా విషయాలే చోటు చేసుకున్నాయి. ఉదయం ప్రత్యర్థులు కౌగిలించుకుని ముచ్చట్లు చెప్పుకోవడం, మధ్యలో చిన్నపాటి గొడవలు, సరదాలు మొత్తానికి అంతా సుఖంతంగానే ఎన్నికలు ముగిశాయి. ఇక ప్రస్తుతం ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. అయితే, ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఈసారి ‘మా’ సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం విశేషం.

మొత్తంగా ఈ ఏడాది 665 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే, ఎన్నికలు ఎంత హోరాహోరీగా సాగినప్పటికీ.. కొందరు స్టార్లు మాత్రం ఎన్నికలకు దూరంగానే ఉన్నారు. ఆ స్టార్ల విషయానికి వస్తే.. విక్టరీ వెంకటేశ్‌, మహేశ్‌ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్‌, రానా, నితిన్, నాగచైతన్య, అల్లు అర్జున్‌, శర్వానంద్‌, సునీల్‌, సుమంత్‌, సుశాంత్‌, సత్యదేవ్‌, అల్లు శిరీష్, వరుణ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌, విజయ్‌ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ, రవితేజతో పాటు ఇంకా పలువురు స్టార్లు ఓటు వేయడానికి హాజరు కాలేదని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :