చరణ్ సరసన ఛాన్స్ కొట్టేసిన బబ్లీ బ్యూటీ ?
Published on Nov 3, 2016 8:38 am IST

Raashi-Khanna
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి ‘ధృవ’ సినిమా ఆఖరి దశ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అది పూర్తైన వెంటనే ఆయన కాస్త బ్రేక్ తీసుకుని దర్శకుడు సుకుమార్ డైరెక్షన్లో ఒక సినిమాని మొదలుపెట్టనున్నాడు. గ్రామీణ నైపథ్యంలో సాగే ప్రేమ కథాగా ఈ చిత్రం ఉండనుంది. ఆయితే తాజాగా సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ప్రస్తుతం వరుస సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్న నటి రాశి ఖన్నాను హీరోయిన్ గా తీసుకోవాలని సుకుమార్ అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ మేరకు రాశి ఖన్నాతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, సుకుమార్ పల్లెటూరి యువతిగా రాశి ఖన్నా అయితే చక్కగా సరిపోతుందనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశముంది. ఇకపోతే ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ నిర్మించనుండగా దేవి శ్రీ సంగీతం అందివ్వనున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది.

 
Like us on Facebook