విజయ్ సరసన సమంత, నయనతార !

Published on Nov 14, 2018 9:15 am IST

ఇళయదళపతి విజయ్ 63 వ చిత్రాన్ని కూడా త్వరలో పెట్టాలెక్కించనున్నాడు. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ, విజయ్ తదుపరి చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాతి రోజున లాంఛనంగా ప్రారంభించనున్నారు.

కాగా, తాజాగా కోలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం.. విజయ్- అట్లీ కాంబినేషన్ లో వస్తోన్న ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్స్ నయనతార, సమంత నటించనున్నట్లు తెలుస్తోంది. గతంలో నయనతార విల్లు చిత్రంలో విజయ్ సరసన నటించగా.. సమంత ‘తేరి, మెర్సల్’ చిత్రాల్లో విజయ్ కి జోడిగా నటించింది.

ఇక విజయ్, అట్లీ కలయికలో వచ్చిన ‘తేరి, మెర్సల్’ సినిమాలు బక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. దీంతో వీరి కాంబినేషన్ లో ఈ సారి రాబోయే చిత్రం కూడా సూపర్ హిట్ అవ్వడం ఖాయం అని, విజయ్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

సంబంధిత సమాచారం :

X
More