స్టార్ హీరో సినిమా సీక్వెల్ ప్రారంభమయ్యేది ఎప్పుడంటే..!
Published on Aug 12, 2017 4:04 pm IST


విక్రమ్ తన సినిమాల జోరుని పెంచాడు. ఇప్పటికే రెండు చిత్రాల్లో నటిస్తున్న విక్రమ్ త్వరలో మరో చిత్రాన్ని కూడా ప్రారంభించనున్నాడు. తమిళ దర్శకుడు హరి దర్శకత్వంలో విక్రమ్ స్వామి 2 చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే. 2003 లో విడుదలైన స్వామి చిత్రానికి ఇది సీక్వెల్.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం సెప్టెంబర్ లో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. విక్రమ్ పోలీస్ అధికారి గెటప్ లో కనిపించనున్నాడు. స్వామి చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటించింది. స్వామి 2 లో కూడా త్రిషని ఓ హీరోయిన్ గా ఎంపిక చేశారు. విక్రమ్ ప్రస్తుతం స్కెచ్ మరియు ధృవ నక్షత్రం చిత్రాలలో నటిస్తున్నాడు.

 
Like us on Facebook