మరో ప్రేమకథతో సమ్మోహన పరచబోతున్న హీరో !

Published on Jul 11, 2018 11:58 am IST

ఆర్‌.ఎస్‌ నాయుడు దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘నన్ను దోచుకుందువటే’. పాత సినిమా గులేభకావళి కథ సినిమాలోని సూపర్‌ హిట్ సాంగ్ పల్లవినే ఈ చిత్రానికి టైటిల్‌ గా పెట్టారు. కాగా ఈ చిత్రానికి సుధీర్‌ బాబే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో నభా నటేష్‌ సుధీర్‌ బాబుకు జోడిగా నటిస్తుండగా అజనీష్‌ బి లోకనాథ్‌ సంగీతం సమకూరుస్తున్నారు.

కాగా ఇప్పటికే విడుదలైన ‘నన్ను దోచుకుందువటే’ ఫస్ట్‌లుక్‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సమ్మోహనం చిత్రంతో భారీ విజయం అందుకున్న సుధీర్ బాబు మళ్ళీ అలాంటి విజయం కోసం ఏరి కోరి చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాతో ప్రేక్షకులను మళ్ళీ సమ్మోహన పరచడానికి ఈ హీరో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడుట. ఐతే తాజాగా ఈ చిత్ర టీజర్‌ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి దర్శక నిర్మాతలు ముహూర్తాన్ని నిర్ణయించారు. జూలై 14 తేదీన ఉదయం పది గంటల రెండు నిమిషాలకు ‘నన్ను దోచుకుందువటే’ టీజర్‌ ను విడుదల చేస్తున్నట్లుగా చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

సంబంధిత సమాచారం :