త్వరలో రివీల్ కానున్న సుధీర్ బాబు సినిమా టైటిల్ !
Published on Feb 21, 2018 8:38 am IST

సుధీర్ బాబు హీరోగా దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కొన్ని నెలల క్రితమే మొదలైన ఈ సినిమా ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తిచేసుకుంది. సుధీర్ బాబు తన పాత్ర తాలూకు డబ్బింగ్ కూడ మొదలుపెట్టాశారు. ఈ చిత్రంలో బాలీవుడు హీరోయిన్ అదితి రావ్ హైదరి కథానాయకిగా నటిస్తోంది.

చిత్రం ప్రారంభమై ఇన్నాళ్లు కావొస్తున్న సినిమాకు సంబందించిన వివరాల్ని బయటపెట్టకుండా దాచిన ఇంద్రగంటి, సుధీర్ బాబులు ఈ ఫిబ్రవరి 22న ఒకేసారి టైటిల్ ను రివీల్ చేస్తామని ప్రకటించారు. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా, పిజి. విందా సినిమాటోగ్రఫీ చేస్తున్నారు.

 
Like us on Facebook