పూజ కార్యక్రమాలతో ఘనంగా మొదలైన సుడిగాలి సుధీర్ నాలుగవ సినిమా

Published on May 12, 2023 5:00 pm IST

యువ నటుడు సుడిగాలి సుధీర్, దివ్య భారతి హీరో హీరోయిన్లుగా పాగల్ ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకత్వంలో చంద్ర శేఖర్ రెడ్డి మొగుళ్ళ మరియు బెక్కం వేణుగోపాల్ నిర్మాతలుగా లక్కీ మీడియా, మహారాజా క్రియేషన్స్ బ్యానర్స్ వారి సరికొత్త సినిమా నేడు ఘనంగా ప్రారంభం అయింది. సుడిగాలి సుధీర్ కెరీర్ లో హీరోగా నాలుగవ సినిమాగా ఇది తెరకెక్కుతోంది. ప్రముఖ నిర్మాతలు డి. సురేష్ బాబు, కె.ఎస్ రామారావు, సూర్యదేవర రాదాకృష్ణ, కెఎల్‌ దామౌదర ప్రసాద్‍ ఈ పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కా ఫస్ట్ షాట్ కి చదలవాడ శ్రీనివాస్ క్లాప్ కొట్టగా జెమినీ కిరణ్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. ఇక మీడియాతో నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ మాట్లాడుతూ ఈ సినిమా స్క్రిప్ట్ ఏడాది క్రితమే ఫైనల్ అయిపోయిందని నాలుగైదు నెలల నుండి ప్రీ ప్రొడక్షన్ గట్టిగా చేసాం అన్నారు.

ఈ సినిమాకు సంబంధించి బెక్కం వేణుగోపాల్ గారే కర్త, కర్మ , క్రియ అన్ని తెలిపారు. ఈ సినిమాకు లియో మ్యూజిక్ అందిస్తున్నారని, అలానే మా సినిమాను అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానని అన్నారు. దర్శకుడు నరేష్ కుప్పిలి మాట్లాడుతూ సుధీర్ గారికి ఈ కథను ఒక గంట నేరేట్ చేయగానే ఆయనకు బాగా నచ్చి ఒప్పుకున్నారు. మా ప్రొడ్యూసర్స్ ఈ సినిమా విషయంలో ఎక్కడా కంప్రమైజ్ కాకుండా అన్ని చేసి పెట్టారు. లియో మాకు మంచి మ్యూజిక్ ఇచ్చారు. మా రైటర్ కి ఫణి థాంక్యూ అని అన్నారు. ఇక నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ ఈ సినిమా ఫస్ట్ షాట్ కి చదలవాడ శ్రీనివాస్ క్లాప్ కొట్టగా జెమినీ కిరణ్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు.

ఎన్నో హిట్ సినిమాలు చేసాను. ఇది కూడా ఒక హిట్ సినిమా అవ్వబోతుంది. మీ సపోర్ట్ కావాలి. దర్శకుడు నరేష్ తో నాకు ఏడేళ్ల పరిచయం ఉందన్నారు. అనంతరం హీరో సుధీర్ మాట్లాడుతూ ఇక్కడికి వచ్చిన అందరికి థాంక్యూ. నన్ను ప్రేక్షకులు ఇంతగా ఆదరించడానికి కారణం మీడియానే అని తెలిపారు. ఇంకో డీటెయిల్ గా మరో ప్రెస్ మీట్ పెట్టి ఇంకొన్ని విషయాలను పంచుకుంటాం థాంక్యూ. అలానే తప్పకుండా అన్ని వర్గాల ఆడియన్స్ ని మెప్పించేలా ఈ సినిమా తెరకెక్కుతోందని మా అందరికీ మీ ఆశీర్వాదనలు కావాలని కోరారు సుధీర్.

సంబంధిత సమాచారం :